కళ్యాణదుర్గం మండలం దాసం పల్లి గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి చెట్టును ఢీకొనింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై కళ్యాణ దుర్గం రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.