ఆదివాసీల పండగలు చాలా ప్రత్యేకత ఉంటాయి. శ్రావణ మాసం ముగింపులో గంజార బోడగ ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా మావల మండలం కొమురం భీం కాలనీలో శనివారం గంజార బోడగ (జాగే మాతరి)ను ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. పొలాల పండగ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టిన మోదుగ మొక్కలను గ్రామ శివారులో అడవిలో పడేసి, తమ వెంట తెచ్చుకున్న సుద్దలతో అక్కడే ఆదివాసీలు అందరూ సహపంక్తి భోజనం చేశారు.