యువత,విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉన్నత లక్ష్యసాధనకై కృషి చేయాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. గురువారంపాల్వంచ (నవభారత్) KSM ఇంజినీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ తెలిపారు.