జగిత్యాల జిల్లా,మల్యాల మండలం,ముత్యంపేట గ్రామపంచాయతీ పరిధిలో గల కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని,ఈనెల 7వ తేదీన ఆదివారం రాహు గ్రస్త చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని మూసివేయనున్నట్లు,మధ్యాహ్నం 12 గంటల నుండి అన్ని అర్జిత సేవలు నిలిపివేయనున్నట్లు, గ్రహణం అనంతరం సోమవారం 8వ తేదీన పుణ్యాహవచనం,సంప్రోక్షణ,తిరుమంజనం,ఆరాధన, అభిషేకాలు,ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం 7 గంటల నుండి యధావిధిగా భక్తులకు సర్వదర్శనం అర్జిత సేవలు ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు శనివారం రాత్రి 7 గంటలకు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు,