విశాఖలో 'సారథ్యం' బహిరంగ సభను ఆదివారం నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు, రాష్ట్ర నేతలు హాజరవుతున్నారు. విశాఖలోని రైల్వే మైదానం వేదిక ఈ సభజరగనుంది. 'సారథ్యం’ బహిరంగ సభలో విశాఖలోని పార్టీ ప్రతి కార్యకర్తను భాగస్వామ్యం చేస్తున్నట్లు మాధవ్ తెలిపారు. కడప నుంచి సారథ్యం యాత్ర ప్రారంభించాం. రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది. ఈ యాత్రలో చాయ్పే చర్చ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం పథకాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుతున్నాయన్నారు.