వైఎస్ఆర్ కడప జిల్లా చెన్నూరుకు చెందిన వృద్ధ దంపతులు వెంకటసుబ్బయ్య, నాంచారమ్మ సిద్ధవటం సమీపంలోని పెన్నా నదిలో దూకి మృతి చెందారు. ఈ దంపతులు అనారోగ్యంతో బాధపడుతుందే వారిని కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. ఈ దంపతులు కనిపించట్లేదని మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను బయటికి తీశారు. రిమ్స్ ఆస్పత్రి వైద్యులు పంచనామ నిర్వహించారు.