ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై అనేక భూకబ్జా ఆరోపణలతో పాటు మద్యం కుంభకోణంలో పాత్ర ఉందని మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. అనంతపురంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒకటిన్నర రోజు ధర్మవరంలో కేతిరెడ్డి తో సమావేశం అయ్యాడని అన్నారు. పులివెందులలో సైతం ఒకటిన్నర రోజు ఎప్పుడు ఉండని జగన్ మోహన్ రెడ్డి ధర్మవరంలో ఎందుకు ఉన్నాడో అర్థమైంది అన్నాడు. చెవిరెడ్డి తో మద్యం డబ్బులు పంపిణీ చేయించి అనంతపురంలో కేతిరెడ్డి తో పంపిణీ చేయించాడేమో అని అనుమానం వ్యక్తం చేశాడు.