నల్గొండ జిల్లా, డిండి జలాశయం నిండుకుండలా మారి ఉదృతంగా ప్రవహిస్తుంది. ప్రాజెక్టుకు కుడివైపున ఉన్న అలుగుల నుండి నీరు ప్రవహిస్తుండడంతో జలదృశ్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. బుధవారం సాయంత్రం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గత కొన్ని రోజులుగా డిండి ప్రాజెక్టు నిండి అడుగు పోస్తుంది. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై ప్రాజెక్టు ఉండడంతో యాత్రికులు జలదృశ్యాలను తమ ఫోన్లలో బంధిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద మత్స్యకారులు ఏర్పాటు చేసిన చేపల రుచులను చవి చూస్తున్నారు. ప్రాజెక్టు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో నీళ్ల వద్దకు వెళ్ళవద్దని ఇరిగేషన్, పోలీస్ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.