ఎమ్మిగనూరు: 'హమాలీల సేవలను గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయం కల్పించాలి'ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న హమాలీల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని IFTU జిల్లా నాయకుడు బాలరాజు వాపోయారు. శుక్రవారం మార్కెట్ యార్డలో యార్డ్ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. యార్డులో కమిషన్ ఏజెంట్ల దగ్గర పనిచేస్తున్న హమాలీలకు గుర్తింపు కార్డులు ఇచ్చి, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.