భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఆర్ అండ్ బీ పరిధిలో 50 చోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో అత్యధికంగా సూర్యాపేట డివిజన్ పరిధిలో 26 చోట్ల రహదారులు డ్యామేజ్ అయ్యాయి.. ఇక కోదాడ, హుజూర్ నగర్ డివిజన్ పరిధిలో 24 చోట్ల రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం జిల్లాలో 1066 మీటర్ల మేర రోడ్లు డ్యామేజ్ అయ్యాయి.