ప్రజాపాలన ప్రభుత్వంలో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని బస్వాపూర్ , సముద్రాల, పందిళ్ళ, పోతారం గ్రామాల్లో జాతీయ రహదారి పై సెంట్రల్ లైటింగ్ ను స్విచాన్ చేసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు, టూరిజం ,పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, గౌరవెళ్లి ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.