పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్లతో గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోగా అభివృద్ధి పనులు పూర్తిచేయాలని స్పష్టం చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేస్తేనే సత్ఫలితాలు సాధ్యమని తెలిపారు.సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు, కమ్యూనిటీ హాళ్లు, స్మశాన వాటికలు, ప్రహరీ గోడలు, పార్కులు, సామాజిక ఫంక్షన్ హాళ్ల అభివృద్ధి వంటి పలు ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు.