గణేష్ నిమజ్జన మహోత్సవం సందర్భంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలతో పాటు, అలజడి సృష్టించే వాతావరణం కలగజేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తూముల నరేష్, చిట్ల సత్యనారాయణ, పూదరి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.