పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తొలి, మలితరం తెలంగాణ ఉద్యమాలను నడిపించిన నాయకుడు.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి ఫొటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. అయిన సేవలు స్ఫూర్తిదాయకం, చిరస్మరణీయం అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి శ్వాస వరకు చిత్తశుద్ధితో కృషి చేసి మూడు తరాలకు వారధిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.