చివ్వేంల మండల పరిధిలోని బీబీ గూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది రోడ్డు ప్రమాదంలో సిఆర్పిఎఫ్ జవాన్ మృతి చెందాడు. ఆత్మకూర్ (ఎస్) మండలం ఏనుభాముల గ్రామానికి చెందిన కలకొట్ల శ్రీను (45) సిఆర్పిఎఫ్ జవాన్ గా మణిపూర్ లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో బీబిగూడెం వద్ద డీసీఎం వాహనం ఢీ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు.