బిక్కనూరు మండల కేంద్రంలో అతి ప్రాచీన పుణ్య క్షేత్రం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శనివారం చతుర్దశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి జిల్లా నుండే కాకుండా వివిధ జిల్లాల భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వత్తులను కాల్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యుడు నాగరాజు తెలిపారు.