నాగిరెడ్డిపేట మండలం జప్తి జానకంపల్లిలో గురువారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గంగమ్మకు బోనాల కార్యక్రమం నిర్వహించారు. గంగమ్మ ఆలయ ఐదో వార్షికోత్సవం సందర్భంగా గ్రామ ముదిరాజ్ సంఘం ఆడపడుచులందరూ అమ్మవారికి బోనాలు అందంగా అలంకరించి సమర్పించారు. పిల్లాపాపలు, పాడిపంటలు చల్లగా ఉండ ముక్కులు మొక్కుకున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం వారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.