స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ద్వారా ఏ సమయంలోనైనా, ఎక్కడ నుంచైనా రేషన్ పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్డులో సోమవారం క్యూ ఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. భీమవరం నియోజకవర్గంలో 79,214 కార్డులు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.