ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే "అప్పుడే మంచిగా ఉండే" కార్యక్రమాన్ని బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో చెన్నూరు నియోజకవర్గంలో నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కుర్మపల్లి లోని ఆయన ఇంట్లో ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరవై నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్న భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.