వరంగల్ నగరంలోని శివనగర్ శ్రీనివాస లేనులోని వినాయక ట్రస్ట్ భవన్ ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వినాయక ట్రస్ట్ అధ్యక్షుడు దామోదర్ శుక్రవారం రాత్రి 9 గంటలకు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు శుక్రవారం లక్ష్మి అమ్మవారికి ఒక కోటి 53 లక్షల రూపాయలతో ధనలక్ష్మి పూజ నిర్వహించి గణపతి మండపంలోని డబ్బులతో అలంకరించారు. ఈ సందర్భంగా గణనాథుని దర్శించుకునేందుకు వందలాదిగా భక్తులు వస్తున్నారని ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ధనలక్ష్మి పూజ నిర్వహిస్తామని దామోదర్ ట్రస్ట్ అధ్యక్షులు తెలిపారు.