యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి చీపిరి కట్టలతో ఊడ్చారు. అదేవిధంగా ఇద్దరమ్మ ఇండ్లను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. డ్రైనేజీ తీస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి డ్రైనేజీలను తీశారు.ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.