యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూర్ మండల కేంద్రంలో మోత్కూర్, ఆత్మకూరు ఎం మండలాలకు చెందిన వర్తక వ్యాపారులు శనివారం మధ్యాహ్నం మార్వాడీలకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్వాడీలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణలో నాసిరకం వస్తువులు అమ్మి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నాసిరకం వస్తువులు తెచ్చి తక్కువ ధరకు అమ్మడం వల్ల అసలైన వస్తువులను అమ్మే స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టం పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తెలంగాణలోని స్థానిక వ్యాపారులకు సహకరించాలని కోరారు. పోలీసులు అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు.