ఒంగోలు వెంకటేశ్వర కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల చేత బల్లలు, కుర్చీలు తుడిపిస్తున్న దృశ్యాలు శనివారం సాయంత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.దీనిపై మీడియా ఆరా తీస్తే ఇది ఆ స్కూల్లో నిత్య కృత్యమని వెల్లడ డయింది. ప్రైవేటు పాఠశాలల్లో చదివే స్తోమత లేక ప్రభుత్వ బడులకు వచ్చే బాలలకు ఈ వెట్టిచాకిరి ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ విషయమై డీఈఓ కు ఫోన్ చేస్తే నిర్లక్ష్య పూరిత సమాధానం వచ్చింది.