పల్లె రహదారులను అభివృద్ధి చేయడంలో, ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనలో కొత్తగూడెం నియోజకవర్గం ఆదర్శమని,వివిధ పథకాలలో మంజూరైన నిధులతో ఇప్పటికే గ్రామీణ అనుసంధాన రోడ్లు, ప్రధాన రహదారులు పూర్తిచేశామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు.జర్నలిస్టు డే సందర్బంగా శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం, పాత్రికేయులను శాలువాలతో సన్మానించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ గ్రామీణ రహదారులు,పట్టణ అంతర్గత రహదారులు,వంతెనల నిర్మాణంపై ప్రత్యేక ద్రుష్టి సారించామని తెలిపారు.