కరీంనగర్ లోని దీపిక ప్రైవేట్ ఆసుపత్రిలో యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేశామని కరీంనగర్ సిపి గౌష్ అలం మంగళవారం తెలిపారు. జ్వరంతో బాధపడుతున్న యువతి చికిత్స కోసం ఈ నెల 6వ తేదీన ఆసుపత్రిలో చేరిందన్నారు. కాగా అదే ఆసుపత్రిలో ఓటి అసిస్టెంట్ గా పనిచేస్తున్న దక్షిణమూర్తి అనే వ్యక్తి పేషంట్ కు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు తమ విచారణలో అది నిజమేనని తేలిందన్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించి నిందితుడైన దక్షిణామూర్తిని అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు మహారాష్ట్ర సిరించ కు చెందిన వాడను తెలిపారు.