ప్రభుత్వ తీరుపై కోదాడ మండలం గుడిబండ సొసైటీ వద్ద రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాట్లు వేసి నెల కావొస్తుందని యూరియా ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేయింబవళ్లు సోసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. కాగా ఏడు గ్రామాలకు చెందిన రైతులకు కేవలం 277 బస్తాల యూరియా వచ్చిందని అది ఎలా సరిపోతుందని మండిపడ్డారు.