అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోటలో వెలసిన హజరత్ సయ్యద్ షా వలి బాషా ఖాద్రి రహంతుల్లా అలైహి 678వ ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. శనివారం రెండో రోజు ఉరుసు ఉత్సవాలలో భాగంగా గంధం ఊరేగింపు నిర్వహించారు. కోటలోని దర్గా నుంచి జెండా కట్ట వరకు గంధాన్ని గుర్రంపై ఉంచి ఊరేగించారు. పురవీధులలో భక్తులు గంధాన్ని చక్కెర చదివింపులు ఇచ్చారు. ముజావర్లు దర్గాలో ప్రత్యేక ఫాతెహలు చేశారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు