అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెద్దహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం హుండీల ముడుపుల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టామని సాయంత్రం ఐదు గంటలకు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమలరెడ్డి పేర్కొన్నారు. దేవాదాయ శాఖ కర్నూలు డిప్యూటీ కమిషనర్ కార్యాలయ అధికారులు బళ్లారి వీరభద్ర స్వామి సేవా సంస్థ సభ్యులు అనంతపురం శివాలయం సేవ సభ్యులు తదితరులు కలిసి ఆలయ హుండీలను లెక్కించడం జరిగింది. హుండీల నుండి రూ.33, 75,028 నగదు, 12.9 గ్రాముల బంగారం, 697 గ్రాముల వెండి వచ్చిందని అధికారులు పేర్కొన్నారు.