నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియం సమీపంలో జనాలు సోమవారం మధ్యాహ్నం చెప్పుల కోసం ఎగబడ్డారు. గుర్తు తెలియని వ్యాపారి అమ్ముడు పోనీ చెప్పులను వదిలేసి వెళ్లడంతో వాటిని దక్కించుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. చెప్పుల కోసం ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. చేతికి దొరికిన చెప్పులను అందుకొని క్షణాల్లోనే రోడ్డు పక్కన ఉన్న చెప్పులను మాయం చేశారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.