కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందరు హైదరాబాద్ లో గృహ నిర్బంధం చేయడం. అప్రజాస్వామికమని బీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు చెలిమెల భాను ప్రసాద్ గురువారం అన్నారు. ముందస్తు అరెస్టులతో సమస్యలు పరిష్కారం కావని, ఎన్నికల హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కామారెడ్డి వరద బాధితులకు ఆర్థిక సాయం, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు. రైతులకు ఎకరానికి రూ.40 వేల రూపాయలు చెల్లించాలని, ప్రమాదాలకు గురైన ఇండ్లకు, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.