సీఎం రేవంత్ రెడ్డికి ఓటు వేసి తప్పు చేశామని రైతులు బానోత్ బిక్షం, బాజ్జు అన్నారు. సూర్యాపేట మండలం పిన్నాయపాలెం పీఏసీఎస్ కేంద్రం వద్ద బుర్క పిట్ట తండాకు చెందిన వారు నిరసన తెలిపారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎన్నడూ యూరియా కోసం ఇలా పడిగాపులు కాయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.