అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రం వద్ద 42వ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో లావణ్య అనే మహిళ మృతి చెందడంతో పాటు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక కారులో అనంతపురం కు చెందిన సుధీర్, లావణ్య దంపతులు కుమారుడు ఉదయ్ తో కలిసి అనంతపురం నుంచి హంపికి వెళుతుండగా, మరొక కారులో అనంతపురంకు చెందిన శ్రీనివాసులు, సంజీవ రెడ్డి, నాగిరెడ్డి ,వెంకటప్ప నాయుడు గోవాకు వెళ్లి అనంతపురంకి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.