చంద్రశేఖరపురం పోలీస్ స్టేషన్ ను కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను డీఎస్పీ పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్ ను అడిగి తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా నిమజ్జనోత్సవం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో పామూరు సిఐ భీమా నాయక్ పాల్గొన్నారు.