మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ప్రైవేట్ ఎరువుల దుకాణానికి కేటాయించిన యూరియా బస్తాలను అక్రమంగా విక్రయించిన షాపును సిజ్ చేసినట్లు AO రాంజీ నాయక్ గురువారం సాయంత్రం 5:00 లకు తెలిపారు.. కొత్తపేట గ్రామంలోని శ్రీ దివ్య ఫర్టిలైజర్ యజమాని శేఖర్ తమ దుకాణానికి కేటాయించిన 115 యూరియా బస్తాలను నిబంధనకు విరుద్ధంగా విక్రయించారని ఆరోపణలు వచ్చాయాని, దింతో విచారణ చేపట్టి నిజమని తేలడంతో షాపు లైసెన్స్ రద్దు చేసినట్లు ఏవో తెలిపారు.. ఇలా ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా యూరియా విక్రయించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు.