అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని పింఛన్ మొదటి రోజే 91 శాతం మందికి తమ అధికారుల చేత గ్రామాల్లో పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని ఎంపీడీవో లక్ష్మీనారాయణ సోమవారం పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా ఉన్న వికలాంగ, వృద్ధాప్య, వితంతు పించన్ దారులు మొత్తం 5693 మందికి గాను 5177 మందికి పింఛన్లను అందించి 91% తమ అధికారులు పంపిణీని సాయంత్రం 6 గంటలకు పూర్తి చేశారని ఎంపీడీవో పేర్కొన్నారు. బెళుగుప్ప లో అధికారులతో కలసి టీడీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున పింఛన్ల పంపిణీ చేశారు.