యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండలంలోని ములకలపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జిల్లా కలెక్టర్ హనుమంతరావు శనివారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొత్తం ఎన్ని ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి, ఇంకా నిర్మాణం ప్రారంభించని ఇండ్లు ఎన్ని ఉన్నాయని ఎంపీడీవోను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు నిర్మాణం పూర్తయినంతవరకు లబ్ధిదారులకు వారి అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయా లేదా అని లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన ఇండ్లను నిర్మించుకోవాలని సూచించారు.