శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.ఘాట్ రోడ్డులోని లింగాల గట్టు నుండి డ్యామ్, విష్ణుగిరి, బ్రహ్మగిరి, హైదరాబాద్ రోడ్డు మార్గాన సుమారు 10 కిలోమీటర్ల మేర తీవ్ర ట్రాఫిక్ జామ్ తో యాత్రికులు రోడ్లపై ఇబ్బందులు పడుతున్నారు.శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ అందాలు చూసేందుకు జలాశయం గేట్లలో నుంచి జాలువారే వరదనీరు భక్తుల చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి, దాంతోపాటు చుట్టుపక్కల గ్రామాల వారు శ్రీశైలం డ్యాం పెద్ద బ్రిడ్జి వద్ద విగ్రహాలు నిమజ్జనం చేస్తుండడంతో తో హైద్రాబాద్ శ్రీశైలం ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోయింది తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.