రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక టూరిజం అభివృద్ధిలో మెదక్ ప్రాంతాన్ని చేర్చాలని శాసనమండలిలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్సీ శేషు సుభాష్ రెడ్డి మాట్లాడిన వీడియోను రాత్రి 7 గంటలకు విడుదల చేశారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్ అర్బన్ పార్క్ కొల్చారం మండలం ఏడుపాయల వన దుర్గ భవాని మాత ఆలయం మెదక్ జిల్లా చర్చి పోచారం అభయారణ్యం ప్రాంతాలకు ప్రత్యేక చరిత్ర ఉందన్నారు. ప్రత్యేక టూరిజం అభివృద్ధిలో మెదక్ జిల్లాలో చేర్చాలన్నారు.