గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని అధికారులు సూచించారు. గురువారం గణేశ్ ఉత్సవాలను పురస్కరించుకుని ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సందీప్, తహశీల్దార్ వెంకట్రావు ఆధ్వర్యంలో శాంతి కమిటీ నిర్వహించారు. ఈ సమావేశంలో గణేశ్ మండప నిర్వహకులు పాల్గొన్నారు. వారికి పలు సూచనలు చేశారు. వినాయకుని ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలన్నారు. అలాగే మండపాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండపాల వద్ద మద్యం తాగవద్దన్నారు.