తిమ్మాపూర్ గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహించి ఫీవర్ వచ్చిన వారికి డెంగ్యూ పరీక్ష నిర్వహించాలని వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. అలాగే వైద్య సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. ఆదివారం జగదేవ్ పూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో జిల్లా కలెక్టర్, వైద్య, గ్రామపంచాయతీ ఇతర అధికారులతో కలిసి డెంగ్యూ నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఫీవర్ సర్వే, డెంగ్యూ పరీక్షలు నిర్వహించే హెల్త్ క్యాంపును పరీక్షించి గ్రామం మొత్తం ఫీవర్ సర్వే నిర్వహించాలని ఫీవర్ ఏలాంటి సిమ్టమ్స్ ఉన్న డెంగ్యూ పరీక్ష నిర్వహించి వెంటనే టీ హబ్కు పంపించి రిజల్ట్ తీసు