ఆంధ్ర గోవాగా పేరుగాంచిన బాపట్ల సూర్యలంక బీచ్ పర్యాటక ప్రదేశంగా మారినప్పటికీ, భద్రతాపరమైన అంశాలలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని జై భీమ్ రావ్ భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు పర్రె కోటయ్య ఆదివారం అన్నారు. ఆయన మాట్లాడుతూ, వారాంతాల్లో 20 వేల మంది పర్యాటకులు బీచ్ కు వస్తున్నారని, కానీ కనీసం ప్రాథమిక చికిత్స కేంద్రం కూడా లేదని, అంబులెన్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. బాపట్ల ఎమ్మెల్యే ఏగేశ్న నరేంద్ర వర్మ స్పందించే అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు.