గుత్తి మండలం అబ్బేదొడ్డి గ్రామానికి చెందిన భోగేశ్వర్ రెడ్డి అనే రైతు పాముకాటుకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. భోగేశ్వర రెడ్డి గ్రామ శివారులో పొలంలో గడ్డి కోస్తుండగా పాము చెయ్యికి చుట్టుకుని కాటు వేసింది. వెంటనే చెయ్యికి వాపు వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్యం అందించారు. రక్త పరీక్షలు నిర్వహించారు.