జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం మండల కేంద్రంలోని ఆరో వార్డులో గల పలువురు ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోందని గురువారం బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. బురద,మురికి నీరు వచ్చి ఇళ్లలోకి చేరడంతో పాములు,క్రిములు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయని కాలనీవాసులు మండిపడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థకు అడ్డంగ నిర్మాణాలతోనే ప్రతి సంవత్సరం ఇళ్లలోకి నీరు చేరుతుందని కాలనీవాసులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. స్థానిక నాయకులు,అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకున్న పాపాన పోలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.