ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఆటో డ్రైవరు వీరేంద్ర(19) మృతిపై తల్లిదండ్రులు రాజు, లక్ష్మి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినట్లు గురువారం పట్టణ ఎస్సై మధుసూధన్ రెడ్డి చెప్పారు.. మృతుడి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. తమ కుమారుడు అదే కాలనీ దగ్గర ఉంటున్న ఓ బాలికను కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడన్నారు. తాము దైవదర్శనానికి వెళ్లిన సమయంలో బాలిక తండ్రి తమ కుమారుడిని కొట్టి చంపి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించాడని ఆరోపించారు. ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు