రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల వ్యాప్తంగా బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. అక్కడక్కడ కొన్ని చెరువుల నుండి మత్తడి ప్రవహిస్తున్నాయి. కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువులకు గండ్లు పడి పంట పొలాలు మునిగిపోయాయి. వర్షం కారణంగా ఇంట్లో నుండి బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితి నెలకొంది. భారీ వర్షం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని ఇటు అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి నెలకొంది.