రాష్ట్రంలో యూరియా కొరతపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు జిల్లా పర్యటనలో స్పష్టమైన సమాధానం చెప్పాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ డిమాండ్ చేశారు..మంగళవారం పాల్వంచ సొసైటీ ఆఫీస్ వద్ద రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అన్నవరపు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..