Download Now Banner

This browser does not support the video element.

పలమనేరు: గంగవరం: వినాయక విగ్రహ నిమజ్జనం కార్యక్రమంలో చేతిలో పేలిన బాంబు యువకుడికి గాయాలు

Palamaner, Chittoor | Aug 31, 2025
గంగవరం: మండల కేంద్రం స్థానికులు తెలిపిన సమాచారం మేరకు. గంగవరం నందు వినాయక చవితి పండుగ సందర్భంగా గణపతి ప్రతిమను ఏర్పాటు చేసి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో నేడు నిమజ్జనానికి తరలించారు. ఈ నేపథ్యంలో కొంతమంది యువకులు ఉత్సాహంగా బాణాసంచా కాల్చి వేడుక చేసుకుంటున్న సందర్భంగా,చంద్రమోహన్ అనే యువకుడు ఓ బాంబును చేతిలో పేలుస్తున్న సందర్భంగా అది పేలిపోయింది దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడిని స్నేహితులు వెనువెంటనే పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కావున టపాకాయలను దూరం నుంచే కాల్చాలని ఎట్టి పరిస్థితుల్లోనూ చేతిలో కాల్చొద్దన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us