మహబూబాబాద్ మున్సిపాలిటీలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎదుట మంగళవారం మధ్యాహ్నం 2:00 లకు సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు సోమన్న మాట్లాడుతూ.. గాంధీ పార్కులోని కూరగాయల మార్కెట్ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు తరలించి ప్రారంభించాలన్నారు. గాంధీ పార్క్ సామాజిక కార్యకలాపాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని ఉపయోగించి నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించకుండా నిర్లక్ష్యం చేయడం ఏందని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. తక్షణమే మార్కెట్ ను ప్రారంభించి గాంధీ పార్కును వివిధ కార్యక్రమాలకు ఉపయోగించాలన్నారు.