నల్గొండ జిల్లా, కనగకల్ మండలం, పగిడిమర్రి గ్రామంలోని రైతులకు వర్షంలో సైతం యూరియా కష్టాలు తప్పడం లేదు. నిన్న ఉదయం నుండి బారులు తీరి సాయంత్రం వరకు ఎదురు చూసిన యూరియా లారీ రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు . శనివారం పగిడిమర్రిలోని రైతు వేదికకు యూరియా లారీ రాగా భారీ ఎత్తున తరలివచ్చిన రైతులు వర్షం కురుస్తున్న లెక్కచేయకుండా క్యూ లైన్ లో నిలబడ్డారు. వ్యవసాయ అధికారి సునీత సీరియల్ ప్రకారం రైతులకు యూరియాను అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా యూరియాను రైతులకు అందజేయడం జరిగిందని తెలిపారు.