సుల్తాన్పూర్ గ్రామంలోని యస్ ఇంటర్నేషనల్ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు తమ న్యాయ హక్కుల కోసం గురువారం పరిశ్రమ ముందు ధర్నా నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళా కార్మికులు పని చేస్తున్నారన్నారు. కార్మికులు తమ డిమాండ్లలో భాగంగా పరిశ్రమ యాజమాన్యం నుంచి కనీస వేతనం, ఈఎస్ఐ, పీఎఫ్, పండగ సెలవులు, బోనస్, రవాణా సౌకర్యం, ఓవర్ టైం డ్యూటీకి డబుల్ అమౌంట్ లాంటి హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికుల కోసం అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్మికులు పరిశ్రమ హెచ్ఆర్ అధికారికి మెమోరండం కూడా అందజేశారు.